News February 26, 2025
ఏలూరు జిల్లాలో సెలవులు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఈనెల 27 గురువారం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఉపాధ్యాయులతో పాటు, డిప్యూటీ ఎంఈవోలు, ఎంఈఓలకు కూడా సెలవు వర్తింపజేయడం జరిగిందన్నారు.
Similar News
News February 24, 2026
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News February 24, 2026
YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN

AP: వైసీపీ ప్రభుత్వంలో తిరుమలపైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై దాడులు చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘2,032 దేవాలయాలపై దాడి చేశారు. 59 విగ్రహాలు చోరీ అయ్యాయి. ఎన్నో చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారు. అంతర్వేది రథం దగ్ధాన్ని తేనెటీగల దాడి అని చెప్పారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు’ అని వివరించారు. ఎవరైనా దేవాలయాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News February 24, 2026
నిర్మల్: పది పరీక్షలకు 9,758 మంది విద్యార్థులు

పదవ తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి, 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,758 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


