News February 15, 2025
ఏలూరు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
Similar News
News March 23, 2025
28న చింతలూరు నూకాంబిక జాతర

ఆలమూరు మండలం చింతలూరులో కొలువైయున్న నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆలయ కమిటీ శనివారం తెలిపింది. 28వ తేదీ శుక్రవారం అమ్మవారి జాతర జరుగుతుందన్నారు. 29వ తేదీ శనివారం తీర్థం జరుగుతుందని చెప్పారు. 30వ తేదీ ఆదివారం ఉగాది ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో శివాని ఈ ఘనత సాధించారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో సీటు సాధించడం విశేషం.
News March 23, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ

రుషికొండ బీచ్ తన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందింది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ ఇండియా జాతీయ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్, బ్లూ ఫ్లాగ్ ఇండియా జ్యూరీ సభ్యుడు అజయ్ సక్సేనా విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కుఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని శనివారం అందజేశారు.