News April 9, 2025
ఏలూరు: జిల్లాలో 11న సీఎం పర్యటన ఇలా..

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో 11న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హెలికాఫ్టర్లో ఉదయం 10. గంటలకు వడ్లమాను గ్రామం చేరుకుంటారు. అనంతరం బీసీ వర్గాల వారితో పని ప్రదేశంలో సమీక్షిస్తారు. 11.30 గంటలకు స్థానిక ప్రజా వేదిక వద్ద ప్రజలతో, పార్టీ క్యాడర్తో ఆయన ముఖాముఖీ నిర్వహించనున్నారు. తిరిగి 2.30 గంటలకు హెలికాఫ్టర్లో విజయవాడ బయలుదేరి వెళ్తారు.
Similar News
News December 4, 2025
పంచాయతీ ఎన్నికల దశలో నాయకత్వ లోపం..!

WGL: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దశలోనూ బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ లోపంపై విమర్శలు చెలరేగుతున్నాయి. 2022లో నియమించిన జిల్లా అధ్యక్షులే కొనసాగుతుండగా, కొత్త కమిటీలపై అధిష్ఠానం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కేడర్లో ఉంది. జనగామ అధ్యక్షుడు కన్నుమూసినా, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసినా ఇప్పటికీ స్థానభర్తీ లేకపోవడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
News December 4, 2025
WGL: సోషల్ మీడియానే మొదటి ప్రచార అస్త్రం..!

ఉమ్మడి ఓరుగల్లులో జీపీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దేవాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు, ఇళ్ల పంపిణీ, శుద్ధి నీటి సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, చమత్కార స్లోగన్లు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.
News December 4, 2025
HYD: వెల్డింగ్ ట్రైనింగ్.. సర్టిఫికెట్

మాదాపూర్ NAC- జాతీయ భవన నిర్మాణ సంస్థలో ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజులపాటు రూ.15,000 ఫీజుతో శిక్షణ ఇస్తారు. భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉద్యోగం లేనివారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు. వారికి నెలకు రూ.6,000కు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.


