News March 17, 2025
ఏలూరు జిల్లాలో 133 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు 133 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 25,179 మంది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారన్నారు. అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ పరీక్షల నిమిత్తం 62 మంది కస్టోడియన్లను, 1,120 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Similar News
News November 28, 2025
VKB: తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్కు పురస్కారం

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావుకు వరించింది. MBNR(D) మక్తల్లో జన్మించిన ఆయన రంగస్థల కళల్లో పిహెచ్.డి పూర్తి చేశారు. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసి ఆలిండియా రేడియో, దూరదర్శన్ మాధ్యమాల్లో ప్రతిభ కనబరిచారు. ఈ పురస్కారం JAN 2న ప్రధానం చేయనున్నారు. దీంతో పలువురు అభినందనలు తెలిపారు.
News November 28, 2025
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి: హరీశ్ రావు

వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు కాపాడే వృత్తిలో అక్రమ మార్కులతో పాసై ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News November 28, 2025
బాపట్ల: వికటించిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి

మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న బాలికకు, స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించారు. నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే గుంటూరు GGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


