News March 4, 2025
ఏలూరు జిల్లాలో 14 మంది లైన్ మెన్‌లకి అవార్డులు

జాతీయ లైన్మెన్‌ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో 14 మంది లైన్మెన్లను ఎంపిక చేసి బెస్ట్ లైన్మెన్ అవార్డు అందజేసినట్లు SE సాల్మన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా సిబ్బంది ఉత్సాహంగా పనిచేయాలన్నారు. అవార్డు పొందిన వారికి ప్రశంస పత్రాన్ని అందజేశారు. డిఈలు పీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.
Similar News
News February 28, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.16,100
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,812
*వెండి 10 గ్రాముల ధర రూ.2,770 గా ఉంది.
News February 28, 2026
ఇది ‘యుద్ధ ప్రపంచం’

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐదారు యుద్ధాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అవకాశాన్ని బట్టి ఇటు గాజాలోని హమాస్ మిలిటెంట్లు, అటు లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులు చేస్తోంది. ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై అటాక్ చేశాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా వార్ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ కూడా భీకర పోరాటాలు చేసుకుంటున్నాయి.
News February 28, 2026
ఎక్కువగా తినడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయ్: సీఎం

అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. రావివలస ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల సుగర్ వస్తుందన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, రాగులు వంటి మిలెట్స్ వినియోగించాలని హితవు పలికారు. పూర్వం మన పెద్దలు అదే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేవారన్నారు.


