News March 4, 2025

ఏలూరు జిల్లాలో 14 మంది లైన్ మెన్‌లకి అవార్డులు

image

జాతీయ లైన్మెన్‌ల దినోత్సవం సందర్భంగా జిల్లాలో 14 మంది లైన్మెన్లను ఎంపిక చేసి బెస్ట్ లైన్మెన్ అవార్డు అందజేసినట్లు SE సాల్మన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా సిబ్బంది ఉత్సాహంగా పనిచేయాలన్నారు. అవార్డు పొందిన వారికి ప్రశంస పత్రాన్ని అందజేశారు. డిఈలు పీర్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.

Similar News

News March 16, 2025

భూమిపైకి సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

image

వారం రోజుల మిషన్‌పై వెళ్లి 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమిపై అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 19న భూమికి తిరిగి రానున్నారు. వీరు ప్రయాణించే డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. దీంతో వ్యోమగాములిద్దరూ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కోరుకుంటున్నారు.

News March 16, 2025

FRO స్క్రీనింగ్ టెస్ట్.. 70.85% హాజరు

image

AP: రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇవాళ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని APPSC ప్రకటించింది. 70.85% హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.

News March 16, 2025

వచ్చే ఎన్నికల కోసమే స్టాలిన్ ఆరాటం: కిషన్ రెడ్డి

image

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆ రాష్ట్ర CM స్టాలిన్ త్రిభాషా విధానంపై రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘స్టాలిన్ వితండవాదం చేస్తున్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదు. ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని మొదట నిర్ణయించిందే మోదీ సర్కారు. రూపీ సింబల్‌ను మార్చడం తమిళనాడు ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.

error: Content is protected !!