News April 29, 2024
ఏలూరు జిల్లాలో 2,162 అనుమతులు ఇచ్చాం: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సువిధ ద్వారా 2,255 అభ్యర్థనలు వచ్చాయని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. వీటిలో 2,162 అభ్యర్థనలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇంకా 93 పరిశీలనలో ఉన్నాయన్నారు. సి-విజిల్ ద్వారా 439 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. అటు ఎన్నికల ఉల్లంఘనలపై వచ్చిన 114 ఫిర్యాదులు పరిష్కరించామని స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2025
ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్మాల్ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.
News November 21, 2025
మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.


