News March 27, 2025

ఏలూరు జిల్లాలో 4 వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం

image

ఏలూరు జిల్లాలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు స్థాపించడానికి 4 వేల ఎక‌రాల భూమిని సిద్ధం చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. వ్యవసాయ, పర్యాటక రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయ‌డానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. జిల్లా జీడీపీని 15 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పామాయిల్, ఉద్యాన పంటలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

Similar News

News October 22, 2025

HYD: పెద్ద సదర్ ఉత్సవం.. నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.

News October 22, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
✓దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
✓చుంచుపల్లి: 3 ఇంక్లైన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
✓మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: మణుగూరు డీఎస్పీ
✓ములకలపల్లిలో పర్యటించిన కలెక్టర్
✓పాల్వంచ SHOను సస్పెండ్ చేయాలి: ఆదివాసి జేఏసీ
✓మణుగూరు:డివైడర్ ను ఢీ కొట్టిన బైక్ యువకుడికి గాయాలు
✓దమ్మపేట, కరకగూడెం మండలాల్లో దంచి కొట్టిన వర్షం

News October 22, 2025

డీఏ జీవోలో మార్పులు

image

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్‌లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.