News March 8, 2025

ఏలూరు జిల్లాలో 8 నుంచి పి-4 సర్వే: కలెక్టర్

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 8 నుంచి పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సర్వేను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. 

Similar News

News October 14, 2025

వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకోండి

image

మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం వైట్ డిశ్చార్జ్. అయితే ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు. దుర్వాసన, రంగుమారడం, మంట అసౌకర్యం వంటి లక్షణాలకు ఇన్ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు కారణం కావొచ్చంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోయి గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. <<-se>>#Womenhealth<<>>

News October 14, 2025

బనకచర్లను ఆపండి… CWCకి తెలంగాణ లేఖ

image

ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం CWC, పోలవరం అథారిటీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం DPRకు విరుద్ధంగా ఉందని లేఖలో వెల్లడించింది.

News October 14, 2025

MDK: గురుకులాల నిధులపై రేవంత్ మాటలు నీటి మూటలేనా? హరీష్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానెల్ ద్వారా గురుకులాలకు నిధులు విడుదల చేస్తామన్న మాటలు నీటి మూటలేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని 1,024 గురుకులాలకు కేవలం రూ.60 కోట్లు కేటాయించడం సిగ్గుచేటని అన్నారు. పెండింగ్ బిల్లులు, అద్దె బకాయిలు, సిబ్బంది వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. గురుకులాల సమస్యల పరిష్కారానికి తక్షణ నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.