News March 8, 2025
ఏలూరు జిల్లాలో 8 నుంచి పి-4 సర్వే: కలెక్టర్

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 8 నుంచి పీ-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సర్వేను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యమని అన్నారు.
Similar News
News February 9, 2026
టెన్త్ పరీక్షల ఫీజుకు 3 రోజులే గడువు: DEO

అల్లూరి, పోలవరం జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్షలు ఫీజు గడువు ఈ నెల 12తో ముగుస్తుందని DEO రామకృష్ణారావు సోమవారం తెలిపారు. తత్కాల్ ద్వారా రూ. 1000 అపరాధ రుసుంతో చెల్లించవచ్చన్నారు. ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. WWW.bseap.org.website. ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని సూచించారు. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.
News February 9, 2026
ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: APC మమ్మీ

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష APC మమ్మీ సోమవారం కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించారని చెప్పారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. నివాస ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20 నుంచి మార్చి10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
News February 9, 2026
నలుగురు లెక్చరర్లు.. రూ.4 లక్షల జీతం.. ఒక్కరే విద్యార్థి

AP: విద్యావ్యవస్థలో సరైన ప్రణాళిక, ముందుచూపు, కార్యాచరణ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఏలూరు(D) ముసునూరు ZP స్కూల్‌లో ఏర్పాటైన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి ఉండగా, పాఠాలు చెప్పడానికి నలుగురు లెక్చరర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ₹4L జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


