News August 4, 2024

ఏలూరు జిల్లాలో 9మంది SIల బదిలీ

image

ఏలూరు జిల్లాలో 9మంది SIలు బదిలీ అయ్యారు. భీమడోలు ఎస్సైగా సుధాకర్, లక్కవరం ఎస్సై సుధీర్ ద్వారకాతిరుమల స్టేషన్‌కు, ద్వారకాతిరుమల ఎస్సై సతీష్ వీఆర్‌కు, తడికలపూడి ఎస్సై జైబాబు టి.నరసాపురానికి, టి.నరసాపురం ఎస్ఐ మహేశ్వరరావు వీఆర్‌కు, చింతలపూడి ఎస్సైగా కుటుంబరావు, జీలుగుమిల్లి ఎస్ఐ చంద్రశేఖర్ కొయ్యలగూడెం స్టేషన్‌కు, కొయ్యలగూడెం ఎస్సై విష్ణువర్ధన్ వీఆర్‌కు, నిడమర్రు ఎస్సై శ్రీను వీఆర్‌కు బదిలీ అయ్యారు.

Similar News

News December 4, 2025

ప.గో: ఈ నెల 14 వరకే ఛాన్స్

image

పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం ప్రారంభించింది. వీటి దరఖాస్తుల గడువు ఇటీవల ముగియగా..లబ్ధిదారుల దృష్ట్యా ఈ నెల 14వరకు పొడిగించింది. గతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించి..కొత్తగా అవకాశం కల్పించనుంది. ఇంటి ఏర్పాటుకు రూ.2.50 లక్షల రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి.

News December 4, 2025

పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

image

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్‌ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.

News December 3, 2025

పెనుమంట్రలో ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని రైతులు RSKలను ధాన్యం అమ్మకాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని మార్టేరు బ్రాహ్మణచెరువు ప్రధాన రహదారిపై నిల్వ చేసిన ధాన్యం రాశులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అనంతరం కొద్దిసమయం రైతులతో మాట్లాడారు.