News March 21, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

*గుంటుపల్లి కేసులో నలుగురికి జీవిత ఖైదు* జిల్లాలో కొన్ని చోట్ల మెడికల్ షాపులపై దాడులు* చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కరించిన ఎంపీ మహేశ్* నూజివీడులో గంగానమ్మ విగ్రహం తొలగింపు పై భక్తుల ఆందోళన* 83 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి* డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్* ఏలూరు జిల్లాలో 155.29 కిలోమీటర్ల రోడ్లు పూర్తి: కలెక్టర్ వెల్లడి
Similar News
News December 1, 2025
‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.
News December 1, 2025
అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

దిత్వా తుఫాను కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 శాతం కూడా వరి కోత అవలేదని, వరి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు.
News December 1, 2025
KNR: ‘హెచ్ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.


