News March 22, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

*గుంటుపల్లి మైనర్ బాలిక ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రశంసలు
* సారా రహిత జిల్లా లక్ష్యం ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ సూపర్డెంట్ అజయ్ కుమార్ సింగ్
* దిశా సమీక్షలో పాల్గొన్న ఎంపీ మహేశ్, ఎమ్మెల్యేలు అధికారులు
* కోకో రైతుల సమస్యలు పరిష్కరించాలి
* టి.నర్సాపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలరాజు
* జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ బస్సు సర్వీస్ ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే
Similar News
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News July 11, 2025
జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ కేంద్రం బృందాలు పర్యటన: కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలు ఎంపికలో భాగంగా కేంద్రం నుంచి అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (AMS )బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర ఏఎంఎస్ బృంద సభ్యులు ఏలూరులో కలెక్టర్‌ను కలిశారు. రోజుకు 2 గ్రామాల చొప్పున 36 గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు.