News February 28, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు* బ్యాలెట్ పేపర్ల స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ✷ ద్వారకాతిరుమల హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు ✷ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ✷పట్టిసీమ వీరేశ్వరునికి రూ.42 లక్షల రికార్డు స్థాయి ఆదాయం * టీ. నర్సాపురం, ఉంగుటూరులో రథోత్సవాలు * 3,14,984 మంది ఓటర్లకు గాను 2,18,902 మంది ఓటు వినియోగం 

Similar News

News October 20, 2025

కృష్ణా: ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా.?

image

ఆ రోజులలోని దీపావళి ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉండటం లేదు. 7 రోజుల ముందు నుంచే రీల్స్ గన్స్ పేల్చుకుంటూ జేమ్స్ బాండ్లా ఫీల్ అయ్యేవాళ్లు. పండుగ రోజున నాన్నతో టపాసులు కొనుక్కొని డాబాపై ఎండబెట్టి, నాగుల చవితి కోసం కొన్ని దాచుకోని, సాయంత్రం క్రాకర్స్ కాల్చుకునేవాళ్లు. రాత్రికి ఇంటిబయట కాగితాలు బట్టి.. ఎవరు ఎక్కువ కాల్చారో ఫ్రెండ్స్‌తో డిస్కషన్‌తో పండుగ ముగిసేది. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే COMMENT చేయండి.

News October 20, 2025

వరంగల్: ఇక్కడ దీపావళి తరువాత బతుకమ్మ ఆడుతారు

image

HNK జిల్లా హాసన్ పర్తి మండలం సీతంపేటలో భిన్నమైన సంప్రదాయం ఉంది. మొదటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దసరా ముందు బతుకమ్మ ఆడితే, ఇక్కడ మాత్రం దీపావళి నుంచి 3 రోజుల పాటు చేయడం ఆనవాయతీగా వస్తోంది. నేతకానీ కులస్థుల ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 21న మట్టితో ఎడ్ల బొమ్మలు చేసి నోముకుంటారు. 22న వాటిని నిమజ్జనం చేస్తారు. 23న బతుకమ్మలతో చెరువు వద్ద స్త్రీలు, పురుషులు కలిసి బతుకమ్మ ఆడుతారు.

News October 20, 2025

ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: ఆర్టీసీలో నాలుగు క్యాడర్ల ఉద్యోగుల పదోన్నతులకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో చంద్రబాబు హామీ ఇవ్వగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రమోషన్లకు అర్హులుగా పేర్కొంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ క్యాడర్‌లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.