News March 1, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

* పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ర్యాలీ ప్రారంభం✷ఎన్నికల కౌంటింగ్ కట్టుదిట్టంగా చేయాలి జిల్లా కలెక్టర్ * జిల్లాలో ప్రారంభమైన మొదటి సంవత్సర ఇంటర్ పరీక్షలు ✷ స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్ ✷జిల్లాలో 94. 14% ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ✷ దగాకోరు బడ్జెట్ సిపిఐ నేతలు ✷ కైకలూరులో పెద్దింట్లమ్మ, భీమడోలు జాతర ప్రారంభం * తమ్మిలేరు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

Similar News

News October 19, 2025

కురుమూర్తి ఆలయ హుండీ లెక్కింపు రూ.4.48 లక్షల ఆదాయం

image

చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన హుండీ డబ్బులను శనివారం ఆలయ సిబ్బంది లెక్కించారు. హుండీ ద్వారా రూ.4,48,248 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 19, 2025

ఐనవోలు: 20 ఇసుక ట్రాక్టర్ల సీజ్

image

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వరంగల్ నగరానికి అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో 20 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఆకేరు వాగు నుంచి ఇసుకను ఇలాంటి ప్రభుత్వాలు అనుమతులు లేకుండా తవ్వకాలు చేసి ట్రాక్టర్లతో నగరాలకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

News October 19, 2025

ASF: ‘పది’లో ‘శత’శాతమే లక్ష్యంగా..!

image

​పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే చివరి స్థానాల్లో ఉన్న జిల్లాను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా.. జిల్లాలోని 77 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 3,598 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఈ తరగతులు జనవరి 9 వరకు కొనసాగుతాయి. అభ్యాసన మెరుగుదల కోసం విద్యార్థులకు ప్రతి వారాంతంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.