News March 2, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ఎమ్మెల్సీ అభ్యర్థుల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం * జిల్లాలో సోమవారం రక్తమోడిన రోడ్లు ✷ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ బిజీ బిజీ పర్యటనలు ✷ వందమంది ప్రొబెషనరీ ఎస్ఐలకు నియామక ఉత్తర్వులు✷ ఓట్ల లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ * పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు

Similar News

News November 21, 2025

వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్ ఆదాయం

image

వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకమాసం సందర్భంగా రికార్డ్ స్థాయి ఆదాయం సమకూరింది. అక్టోబర్ 22 నుంచి నవండర్ 20 వరకు ఆర్జిత సేవలు, ఇతర టికెట్ల ద్వారా రూ.4,00,06,720, హుండీల లెక్కింపు ద్వారా రూ.4,22,60,841 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆదాయం 8 కోట్ల 22 లక్షల 67 వేల 561 రూపాయల లభించినట్లు వివరించారు.

News November 21, 2025

ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

image

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.

News November 21, 2025

హనుమకొండ: యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల రిలీజ్ చేపట్టాలి: NPDCL CMD

image

వరి కోతలు పూర్తి అవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల రిలీజ్ చేయాలని 17 సర్కిళ్ల ఎస్ఈలను NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండలోని NPDCL కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే మూడు నెలల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకొని అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా వ్యవసాయ సర్వీసుల పనులను మంజూరు చేయాలన్నారు.