News March 2, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ఎమ్మెల్సీ అభ్యర్థుల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం * జిల్లాలో సోమవారం రక్తమోడిన రోడ్లు ✷ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ బిజీ బిజీ పర్యటనలు ✷ వందమంది ప్రొబెషనరీ ఎస్ఐలకు నియామక ఉత్తర్వులు✷ ఓట్ల లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ * పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు

Similar News

News March 21, 2025

కివీస్‌పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్

image

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్‌ను ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 200కుపైగా టార్గెట్‌ను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి. ఆ జట్టు ఓపెనర్ హసన్ నవాజ్ (105*) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం బాదారు. కెప్టెన్ సల్మాన్ అఘా (51*) హాఫ్ సెంచరీతో రాణించారు.

News March 21, 2025

నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

image

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.

News March 21, 2025

HYD: ‘విద్యార్థి’ ప్రయాణం ప్రమాదం!

image

సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం స్టూడెంట్స్‌ సాహసాలు చేస్తూ కాలేజీలకు వెళుతున్నారు. ప్రమాదపు అంచులో ప్రయాణం ఆందోళన కలిగిస్తోందని నగరవాసులు Way2Newsకు తెలిపారు. అమ్మాయిలూ ఫుట్‌ బోర్డింగ్ చేస్తున్నారు. ఇక అబ్బాయిల పరిస్థితిని పై ఫొటోలో చూడొచ్చు. BNరెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ (గుర్రంగూడ)లో ఈ పరిస్థితి ఉంది. ఈ రూట్‌లో బస్సు సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

error: Content is protected !!