News March 4, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ✷ సమిష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసాం: కలెక్టర్ సెల్వి ✷ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో లైన్మెన్ దినోత్సవ సందర్భంగా 14 మంది లైన్మెన్ లకు సత్కారం ✷ పోలవరం R&R భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: బాలరాజు

Similar News

News November 21, 2025

ఓట్ల సవరణ ఆపండి.. ECకి మమతా బెనర్జీ లేఖ

image

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)ను నిలిపివేయాలని CEC జ్ఞానేశ్ కుమార్‌కు బెంగాల్ CM మమతా బెనర్జీ లేఖ రాశారు. ‘BLOలు పరిమితి దాటి పని చేస్తున్నారు. EC తీరు ఆమోదయోగ్యంగా లేదు. వారికి సపోర్టుగా నిలిచేది పోయి బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న SIRను ఆపాలని కోరుతున్నా. వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వండి. ప్లానింగ్ లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రమాదకరం’ అని పేర్కొన్నారు.

News November 21, 2025

మహిషి కన్నీరు కలిసిన జలం

image

శబరిమల యాత్రలో ముఖ్య ప్రాంతాల్లో ‘అళుదా నది’ ఒకటి. మహిషిని అయ్యప్ప స్వామి వధించిన స్థలం ఇదేనని ప్రతీతి. స్వామి బాణాలకు తాళలేక మహిషి రోదిస్తూ కన్నుమూశాడు. అప్పుడు కార్చిన కన్నీరు ఈ నదిలో కలిసిందట. అందుకే దీన్ని అళుదా(రోదించడం) నది అని అంటారు. అయ్యప్ప భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరించి, 2 రాళ్లను తీసుకొని, యాత్ర మార్గంలోని కల్లిడుకుండ్రుం వద్ద విసిరి తమ యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 21, 2025

ADB: ‘పాఠశాల సమయాన్ని మార్పు చేయాలని కలెక్టర్‌కు వినతి’

image

ADB కలెక్టర్ రాజర్షి షాను PRTU ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పాఠశాల సమయాన్ని మార్చాలని కోరుతూ కలెక్టర్ రాజర్షి షాతో విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్, సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.