News March 14, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷జనసేన జయకేతనం ఆవిర్భావ సభకు పిఠాపురం తరలి వెళ్లిన జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు, కార్యకర్తలు
✷హోలీ సందర్భంగా రంగులు చిమ్ముకొని ఎంజాయ్ చేసిన జిల్లా వాసులు
✷జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుబ్బల మంగమ్మ, రెడ్డి గణపవరం కనకదుర్గమ్మ అమ్మవార్ల జాతర కార్యక్రమాలు
✷మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకులు
✷స్మార్ట్ మీటర్లను బిగించవద్దు: సీపీఐ
Similar News
News November 20, 2025
అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

అక్రమ కేసులతో బీఆర్ఎస్, కేటీఆర్ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.
News November 20, 2025
జనగామ జిల్లా ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

జనగాం జిల్లాలో PMDDKY అమలును ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జనగామ కలెక్టరేట్ వీసీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, నీటిపారుదల, పౌర సరఫరాలు, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ యోజన పురోగతిపై క్షుణ్ణంగా సమీక్షించారు.
News November 20, 2025
NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.


