News March 6, 2025
ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దుర్ఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంతత్రి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం చోదిమెళ్ల బ్రిడ్జి వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరమన్నారు.
Similar News
News March 7, 2025
అచ్చంపేటలో యువతి అనుమానాస్పద మృతి

ACPTలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఆవుల లక్ష్మి (28) గురువారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఎస్సై రమేష్ వివరాలిలా.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె తెల్లవారుజామున పట్టణంలోని సీతారాలగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. గమనించిన స్థానికులు అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ అన్నారు.
News March 7, 2025
NRPT: క్రీడల్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

ఝార్ఖండ్ రాజధాని రాంచీ లో జరిగిన 68వ అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో నారాయణపేట జిల్లాలో పని చేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ గౌడ్ బాంబు డిస్పోజల్ టీమ్ నుంచి రూమ్ సెర్చింగ్ విభాగంలో ప్రతిభ చూపాడు. ఈ సందర్భంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ కానిస్టేబుల్‌ను అభినందించి ప్రశంస పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ఐ నరసింహ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
News March 7, 2025
కొలిమిగుండ్ల హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

కొలిమిగుండ్ల మండలంలోని బెలుం సింగవరం గ్రామంలో భార్యను రోకలి బండతో దాడి చేసి <<15673390>>హత్య<<>> చేసిన ఘటన తెలిసిందే. ఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ గురువారం రాత్రి పరిశీలించారు. కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి మానసిక స్థితి, ఘటనకు గల కారణాలపై స్థానికులతో పాటు, మృతురాలి బంధువులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.