News January 11, 2026

ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో రాజముద్రతో ఉన్న 9,134 పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఏలూరు డివిజన్‌లో 5,501, జంగారెడ్డిగూడెంలో 3,614, నూజివీడులో 90 పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలిదిండి మండలంలో అత్యధికంగా ఉన్నాయని, జాప్యం లేకుండా వీటిని పంపిణీ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

Similar News

News January 22, 2026

హరీశ్ రావు ‘ఫోన్’ క్యాపింగ్ నిజమేనా..?

image

ఫోన్ టాపింగ్ కేసులో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసి విచారించిన విషయం తెలిసిందే. కాగా దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణ సమయంలో మీ ఫోనే ట్యాప్‌కు గురైందని సిట్ అధికారులు హరీశ్ రావుకు వివరించడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ వారి పైనే నిఘా పెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఫోన్ టాపింగ్‌పై కార్లిటీ రావాల్సి ఉంది.

News January 22, 2026

దెందులూరు: బ్రిడ్జి నిర్మాణంపై చింతమనేని సూచనలు

image

దెందులూరు నియోజకవర్గంలో నూతన రోడ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. కొక్కిరపాడు నుంచి దాసరిగూడెం వెళ్లే మార్గం, పెదపాడు మండలంలోని వట్లూరు సహా పలు ప్రాంతాల్లో ఆర్ఓబి, ఆర్ యు బిల నిర్మాణాలు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసి, తదితరులు పాల్గొన్నారు.

News January 22, 2026

ఆర్‌ఓబీలతో ట్రాఫిక్ కష్టాలకు చెక్: కలెక్టర్

image

రైల్వే క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏలూరు జిల్లాలో రోడ్డు ROBల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఏలూరు, దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలోని 27 పెండింగ్ పనులపై ఆమె చర్చించారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.