News January 11, 2026
ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో రాజముద్రతో ఉన్న 9,134 పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఏలూరు డివిజన్‌లో 5,501, జంగారెడ్డిగూడెంలో 3,614, నూజివీడులో 90 పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలిదిండి మండలంలో అత్యధికంగా ఉన్నాయని, జాప్యం లేకుండా వీటిని పంపిణీ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
Similar News
News January 24, 2026
దివ్యాంగ పిల్లలకు పథకాలు అందేలా చూడాలి: జిల్లా జడ్జి

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ జిల్లా జడ్జి భరతలక్ష్మి సూచించారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘సదరం’ శిబిరాన్ని ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. న్యాయ సేవాధికార సంస్థ, డీఆర్డీఏ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2026
మేడారం జాతరకు 24 గంటల ప్రత్యేక బస్సులు

సమ్మక్క-సారలమ్మ జాతర-2026 సందర్భంగా JAN 25 నుంచి FEB 1 వరకు 24 గంటల ప్రత్యేక బస్సులను గోదావరిఖని డిపో నుంచి నడపనున్నట్లు DM నాగభూషణం తెలిపారు. 115 బస్సులు, 230 డ్రైవర్లు, 170 సిబ్బందిని కేటాయించి, పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.230 టికెట్ ధరతో, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. బస్సులు గద్దెల సమీపానికి వెళ్తాయి. గోయిల్‌వాడ జాతరకు JAN 27 నుంచి స్పెషల్ బస్సులు నడుస్తాయి.
News January 24, 2026
నరసరావుపేటలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

ఆడబిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. బాలికల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి రక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.


