News March 22, 2025
ఏలూరు జిల్లా దొంగలు విశాఖలో దొరికారు..!

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&B ఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News October 31, 2025
PDPL: ‘దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం, కలెక్టరేట్ IT ప్రాంగణం నుంచి చౌరస్తా వరకు నిర్వహించిన 2 కి.మీ. ‘యూనిటీ ఫర్ రన్’ ర్యాలీని ఆయన ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
News October 31, 2025
నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
News October 31, 2025
వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వరకట్న నిషేధ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. యువతలో ఎక్కువగా అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


