News September 13, 2024

ఏలూరు జిల్లా బ్యాంకర్‌లకు కలెక్టర్ విజ్ఞప్తి

image

ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్‌లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగం, ప్రజలకు రుణ సౌకర్యంపై బ్యాంకర్లతో ప్రత్యేక డీసీసీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భీమా క్లైముల పరిష్కారంలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించాలన్నారు.

Similar News

News November 22, 2025

ఈనెల 23న సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

image

జిల్లాలో అధికారికంగా ఈనెల 23న సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. సమావేశంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 22, 2025

ప.గో: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

News November 22, 2025

ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

image

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్‌లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.