News September 27, 2024

ఏలూరు జిల్లా వర్షపాతం వివరాలు

image

ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. పెదవేగిలో 56.0 మి.మీ, ద్వారకాతిరుమల 49.6, కామవరపుకోట 41.2, జంగారెడ్డిగూడెం 34.8, భీమడోలు 28.6, బుట్టాయిగూడెం 26.8, పోలవరం 22.2, దెందులూరు 12.6, కొయ్యలగూడెం 12.4, పెదపాడు 10.2, ఏలూరు అర్బన్ 7.2, ఏలూరు రూరల్ 6.4 మి.మీ నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదు అయిందన్నారు.

Similar News

News July 8, 2025

తాడేపల్లిగూడెం: మద్యం తక్కువ పోశాడని హత్య

image

తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ సమీపంలో రెడ్డి గోవింద్ హత్య కేసులో నిందితుడైన గుబ్బల మల్లేశ్వరరావు (53)ను సోమవారం నరసింహారావుపేటలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మద్యం తక్కువ పోశాడని ప్రశ్నించడంతో నిందితుడు మల్లేశ్వరరావు రాయితో గోవింద్ తలపై కొట్టి పారిపోయినట్లు విచారణలో తేలిందని సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News July 8, 2025

మెగా పేరెంట్స్ మీట్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2,79,204 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 37,124 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు.

News July 8, 2025

ప.గో: 1,612 సెల్‌ఫోన్‌ల రికవరీ: ఎస్పీ

image

ప.గో జిల్లావ్యాప్తంగా వివిధ విడతల్లో ఇప్పటివరకు సుమారు రూ.2.40 కోట్ల విలువైన మొత్తం 1,612 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పదవ విడతలో భాగంగా సుమారు రూ.31 లక్షల విలువైన 208 మొబైల్ ఫోన్‌లను బాధితులకు తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.