News March 2, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు

* పోలవరంలో పలువురు పై తేనిటీగలు దాడి చేశాయి.*కొయ్యలగూడెం మండలంలో విద్యార్థులు స్కూల్ బాయికాట్ చేశారు.*జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ర్యాలీలు. *జిల్లాలో ఇరిగేషన్ పనులని పరిశీలించిన కలెక్టర్ వెట్రి సెల్వీ.*పాడే మోసిన దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని. *ఇది దగాకోరు బడ్జెట్ అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య విమర్శ.
Similar News
News November 15, 2025
జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.
News November 15, 2025
సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం కోసం ఎదురుచూపులు

సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు మొత్తం 7,680 యూనిట్లు కేటాయించగా, 7,121 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరికి స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడంతో యువతలో నిరాశ నెలకొంది.
News November 15, 2025
ములుగు: నెక్స్ట్ దామోదరేనా..!?

జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత తక్కల్లపల్లి వాసుదేవరావు @ ఆశన్న ఇటీవల లొంగిపోయారు. తాజాగా రాష్ట్ర నేత కొయ్యడ సాంబయ్య @ఆజాద్ పోలీసులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ములుగులో మిగిలింది బడే చొక్కారావు @దామోదర్ ఒక్కరే. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన చాలాకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్లో పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.


