News April 9, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న లోక్ అదాలత్

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల సముదాయాల్లో మే 10న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాదు కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు కేసులు పరిష్కారించుకోవచ్చన్నారు.
Similar News
News December 24, 2025
మాడిన వేప చెట్లు మళ్లీ పచ్చగా మారతాయా?

‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ ఫంగస్ వ్యాధి వేప చెట్టుకు మాత్రమే సోకుతుంది. ఇది ప్రధానంగా వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభంలో వ్యాప్తి చెందుతుంది. అందుకే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా వేప చెట్లు పత్రహరితం కోల్పోయి, పూర్తిగా ఎండిపోతాయి. మళ్లీ ఈ చెట్లన్నీ మార్చి నెల నాటికి యథావిథిగా పచ్చగా మారతాయి. గతంలో ఉత్తర భారతదేశంలో కనిపించిన ఈ వ్యాధి, ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని వేప చెట్లలో కూడా కనిపిస్తోంది.
News December 24, 2025
ఢిల్లీ మెట్రోకు కేంద్రం నిధులు.. TG ఎదురుచూపు!

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 16km మేర ఢిల్లీ మెట్రో విస్తరణకు రూ.12,015 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా నిరీక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో HYD మెట్రో విస్తరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం మెట్రోను అధీనంలోకి తీసుకోనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ప్రస్తుతం HYDలో 69.2km మెట్రో మార్గం విస్తరించి ఉంది.
News December 24, 2025
కేజీ రూ.3,00,000.. ఎంతో దూరం లేదు!

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. కేజీ సిల్వర్ రేటు ఈ ఏడాది జనవరిలో రూ.90వేలు ఉండగా ఏకంగా రూ.1.54 లక్షలు పెరిగి రూ.2,44,000కు చేరింది. ఇదే జోరు కొనసాగితే కిలో రూ.3లక్షలకు చేరడానికి ఇక ఎంతో కాలం పట్టదని నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,38,930 ఉండగా అతి త్వరలోనే రూ.1,50,000 మార్క్ చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మీరేమంటారు?


