News February 12, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 638 సెల్ ఫోన్లు రికవరీ

ఏలూరు జిల్లాలో రూ.76 . 56 లక్షలు విలువ చేసే 638 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిశోర్ తెలిపారు. బుధవారం ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు ఫోన్లను అందచేశారు. సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల.. నేరానికి వినియోగించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
వరంగల్: ఏడాది గడిచినా వేతనాలు అందని దుస్థితి!

ఇంటింటి కుటుంబ సర్వే పూర్తై ఏడాది గడిచినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు వేతనాలు అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో 1.79 లక్షల కుటుంబాలపై 1200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్వైజర్లకు రూ.12వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రతి దరఖాస్తుకు రూ.30 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినా చెల్లింపులు నిలిచిపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.


