News September 16, 2024
‘ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ’
స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవ 2024 నిర్వహించనున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమష్టిగా ముందడుగు వేయవలసిన అవశ్యకత ఉందన్నారు. జిల్లా స్థాయిలో భాగస్వామ్య సంస్థలతో ఇప్పటికే ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించామన్నారు.
Similar News
News October 7, 2024
ప.గో: TODAY TOP HEADLINES
*భీమవరం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
*తాడేపల్లిగూడెం: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
*చింతలపూడి: పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
*ప.గో: పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి
*ఏలూరు: వ్యక్తిపై దాడి చేసిన 9 మంది అరెస్ట్
*నరసాపురం: లారీని ఢీకొన్న RTCబస్సు.. సీసీ ఫుటేజ్
*తాడేపల్లిగూడెంలో యువకుడు మృతి
*ఉండి: లక్ష దాటిన బీజేపీ సభ్యత్వాలు
*500 రక్తపరీక్ష కిట్లను అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని
News October 6, 2024
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే RRR
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
News October 6, 2024
నరసాపురంలో పదేళ్ల బాలికతో అసభ్యకర ప్రవర్తన
పదేళ్ల బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపట్ల యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.