News November 6, 2024
ఏలూరు: జిల్లా సిబ్బందితో ఎస్పీ నేర సమీక్ష సమావేశం
ఏలూరు జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది తో బుధవారం జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్లలో నమోదు చేసిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా జిల్లా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేయాలని చెప్పారు. పోలీసు అధికారులు ప్రతి గ్రామాన్ని ప్రణాళిక బద్ధంగా సందర్శించాలని, ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిని పరిష్కరించాలని సూచించారు.
Similar News
News November 23, 2024
నరసాపురం లేస్కు భౌగోళిక సూచిక (జీఐ)కు ఎంపిక
నరసాపురం లేస్కు భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న హోటల్ ఒబెరాయ్లో జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా లేస్ పార్క్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
News November 23, 2024
భీమవరం: కేంద్ర మంత్రికి జిల్లా ప్రముఖులు పరామర్శలు
పితృవియోగం పొందిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను పలువురు నేతలు శనివారం పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరమిల్లి రాధాకృష్ణ, ధర్మరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
News November 23, 2024
ఉమ్మడి ప.గో. జిల్లా నేతలకు కీలక పదవులు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నేతలను కీలక పదవులు వరించాయి. APC ఛైర్మన్గా భీమవరం MLA రామంజనేయులు, అదే కమిటీకి సభ్యుడిగా తణుకు MLA రాధకృష్ణ తాజాగా ఎంపికయ్యారు. ఇటీవల ఉండి MLA రఘురామకు DY. స్పీకర్ పదవి లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక జిల్లా నేతలను కీలక పదవులు వరించాయి. దీంతో శుక్రవారం CM, డిప్యూటీ సీఎం, పలువురు కూటమి నాయకులు వారికి అభినందనలు తెలిపారు.