News March 5, 2025
ఏలూరు: జీవీ సుందర్‌కు 16,183 ఎక్కువ ఓట్లు

ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. వీరి తర్వాత మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. రాజశేఖర్‌కు 1,24,702 ఓట్లు రాగా, వీరరాఘవులకు 47,241, జీవి సుందర్‌కు 16,183 ఓట్లు వచ్చాయి.
Similar News
News November 16, 2025
ఖమ్మం: అంతా వారి డైరెక్షన్లోనే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్‌శాఖలో డాక్యుమెంట్ రైటర్ల దందా నడుస్తోంది. జిల్లాలో 11సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లు ఉండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. ఇదే అదునుగా రైటర్లు దండుకుంటున్నారు. 250 మందికి పైగా రైటర్లు ఇదే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై రూల్స్‌కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News November 16, 2025
NLG: అంగన్వాడీల భర్తీ ఎప్పుడు..?!

మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో 150 టీచర్ పోస్టులు, 684 ఆయా పోస్టులు, సూర్యాపేట జిల్లాలో 85 టీచర్, 290 ఆయాలు, యాదాద్రి జిల్లాలో 266 టీచర్, 58 ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<


