News March 30, 2025
ఏలూరు: జైల్లో మహిళా ఖైదీ సూసైడ్

ఏలూరులో జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారిని అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
కొత్తగూడెం: దివ్యాంగుల పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పురస్కారాల ప్రధానం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిన్ తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీ కింద ఈ పురస్కారాలు ఇస్తారని, అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News November 7, 2025
NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.
News November 7, 2025
జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి గజ్వేల్ విద్యార్థి ఎంపిక

SGF జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడలకు గజ్వేల్‌కు చెందిన హర్షవర్ధన్ ఎంపికయ్యాడు. వికారాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 ఫుట్‌బాల్ టోర్నీలో ప్రజ్ఞాపూర్ విద్యార్థి అయిన హర్షవర్ధన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. చివరి మ్యాచ్‌లో నిజామాబాద్‌పై గోల్ చేసి మెదక్ జట్టును గెలిపించాడు. ఈ ప్రతిభతో హర్షవర్ధన్ జాతీయస్థాయి టోర్నమెంట్‌కు సెలక్ట్ అయ్యాడు.


