News June 19, 2024
ఏలూరు: టేకు చెక్కపై రామాయణం

చింతలపూడికి చెందిన మందగుల కనకలింగ వీరబ్రహ్మం తన చేతికళతో టేకుచెక్కపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన ఆయన 2001లో పాత యర్రవర్రపు శేషయ్య స్ఫూర్తితో తలుపులపై దేవుడి బొమ్మలు చెక్కడం, సిమెంట్ దిమ్మెలపై శిల్పాలు చెక్కడంలో ఆరితేరారు. ఈ క్రమంలోనే తాజాగా రామాయణంలోని పాత్రలు, విశిష్ఠతలను 2 అడుగుల మందం గల టేకుచెక్కపై 3 నెలల సమయంలో చెక్కాడు. ఈ కళ అందరినీ ఆకట్టుకుంటోంది.
Similar News
News February 23, 2026
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS ఆఫీసర్ అరెస్ట్

రఘరామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్‌కి చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి బీహార్ వెళ్లారు. గుంటూరు నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదు కాగా సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు.
News February 23, 2026
ప.గో: ‘ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి లేదు’

జిల్లా వ్యాప్తంగా నేడు నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 37,550 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30కు హాజరు కావాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని హెచ్చరించారు.
News February 23, 2026
నరసాపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన డీపీటీఓ

నరసాపురం ఆర్టీసీ డిపోని జిల్లా నూతన ప్రజా రవాణా అధికారి (డీపీ.టీ.ఓ) సప్ప గిరిధర్ కుమార్ ఆదివారం సందర్శించారు. డిపోలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ సత్తి సుబ్బన్న రెడ్డి,ఆఫీసు సిబ్బంది ఉన్నారు


