News March 11, 2025

ఏలూరు: దళారుల ప్రమేయం లేకుండా సర్వే నిర్వహించాలి

image

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో లబ్ధిదారులు గుర్తింపు, పరిహారం లెక్కింపునకు నిర్వహించే గ్రామ సభలలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అర్హులైన లబ్దిదారుల నుంచే వివరాలు సేకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామసభలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను అదేశించారు.

Similar News

News September 16, 2025

సిద్ధిపేట: ‘కేసులను త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి’

image

SC, ST కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సీపీ కమిషనర్ అనురాధ ACPకి సూచించారు. మంగళవారం ఏసీపీ ఆఫీసును సీపీ సందర్శించి రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్ తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న OE త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఏసీపీ రవీందర్ రెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News September 16, 2025

మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

image

మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్‌కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.

News September 16, 2025

దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించాలి: రమేశ్ బాబు

image

కాకినాడ జిల్లాలోని దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు సమావేశమయ్యారు. కాకినాడ బాలాత్రిపురసుందరి ఆలయంలో జరిగిన ఈ సమావేశంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. విజయవాడ, ఇతర ఆలయాలకు డిప్యూటేషన్‌పై వెళ్లేవారు ఒక రోజు ముందుగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆలయ నిధుల లావాదేవీలపై చర్చించారు.