News March 11, 2025
ఏలూరు: దివ్యాంగురాలు గీసిన చిత్రం ఆకట్టుకుంది!

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజు కలెక్టర్ చిత్రపటాన్ని ఎంతో అందంగా గీసి ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో ఆమె కృషికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రశంసించారు.
Similar News
News November 22, 2025
ASF జిల్లాలో 3,53,885 ఓటర్లు

ASF జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేసి ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం రేపటి వరకు అవకాశం కల్పించింది. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 2,874 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,53,885 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,77,269 మంది మహిళలు, 1,76,606 పురుషులు, 20 మంది ఇతరులు ఉన్నారు.
News November 22, 2025
AP TET..అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీ టెట్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుండటంతో అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఆప్షన్ NOV 25న అందుబాటులోకి వస్తుంది. DEC 3నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. DEC 10 నుంచి ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/
News November 22, 2025
రోడ్డు దాటేటప్పుడు మొబైల్ వాడొద్దు: వరంగల్ పోలీస్

రోడ్లు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగంపై పాదచారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్‌పై కేవలం ఒక్క సెకను దృష్టి మళ్లినా ప్రమాదాలకు దారితీయవచ్చని అధికారులు సూచించారు. రోడ్డు దాటేటప్పుడు మొబైల్‌ను పూర్తిగా పక్కన పెట్టి జాగ్రత్తగా నడవాలని తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా పౌరులకు విజ్ఞప్తి చేశారు.


