News March 11, 2025

ఏలూరు: దివ్యాంగురాలు గీసిన చిత్రం ఆకట్టుకుంది!

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అంధ దివ్యాంగురాలైన బత్తుల అంజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంజు కలెక్టర్ చిత్రపటాన్ని ఎంతో అందంగా గీసి ఆమెకు అందజేశారు. ఈ క్రమంలో ఆమె కృషికి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రశంసించారు.

Similar News

News March 8, 2026

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

image

చమురు ఉత్పత్తి, ఎగుమతులను నిలిపేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి మూతతో ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు అనుకూలించాక ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. OPECలో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కువైట్. సగటున రోజుకు 2.6M బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఖతర్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. UAE కూడా క్రూడాయిల్ ప్రొడక్షన్‌ కట్ చేస్తున్నట్లు తెలిపింది.

News March 8, 2026

KNR: జర్నలిజం కోర్సు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

image

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ అని కోర్సు సమన్వయకర్త డా.బూర్ల చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు SSC, INTER జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలోని తెలుగులో విభాగంలో సంప్రదించాలని చెప్పారు.

News March 8, 2026

HYD: ‘కార్యేషు దాసి’.. ‘అర్ధాంగి’కి నిలువెత్తు రూపాలు..!

image

ఆ అన్నదమ్ములను విధి పక్షవాతం రూపంలో వెంటాడింది. ఘట్‌కేసర్‌ అంకుషాపూర్‌కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితయ్యారు. కాగా, వీరి భార్యలు భవానీ, సంధ్య భర్తలకు కన్నతల్లిలా సేవలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ అన్న ఆర్యోక్తిని వీరు నిజం చేసి చూపిస్తున్నారు. అర్ధాంగులు అన్న అర్థానికి జీవం పోస్తున్నారు.