News July 17, 2024

ఏలూరు: దివ్యాంగులకు ఉపకారవేతనాలు

image

ఏలూరు జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి 9, 10 తరగతులు చదివే దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ రాకడ మణి తెలిపారు. అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా http:///scholorships.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News December 8, 2025

టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News December 8, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్లు నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

News December 8, 2025

భీమవరం: రక్తదాన వార్షికోత్సవ గోడపత్రికలు ఆవిష్కరణ

image

భీమవరం కలెక్టరేట్‌లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప.గో.జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.