News November 9, 2024
ఏలూరు: దీపం-2 పథకంపై అధికారులతో జేసీ సమీక్ష

ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, ఆయిల్ కంపెనీ యాజమాన్యాలు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 6,31,044 మంది బియ్యం కార్డుదారులలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందుటకు అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈకెవైసి పూర్తైన తరువాత మాత్రమే అర్హులన్నారు.
Similar News
News February 24, 2026
ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.