News November 5, 2024
ఏలూరు: ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్
ఏలూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో పూతి ప్రసాద్ , అప్పల నాయుడు, నాగాంజనేయులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.17,50,000 విలువ గల 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News December 3, 2024
అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: ప.గో జిల్లా ఎస్పీ
పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
News December 2, 2024
నిడదవోలు: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల వినతి
పని ఒత్తిడి తగ్గించాలంటూ నిడదవోలు మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డి. లక్ష్మినారాయణకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్వేలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఓ పక్క చేయాల్సిన పని, మరోపక్క వరుస వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలతో ఇబ్బందిగా ఉందని అన్నారు.
News December 2, 2024
డిసెంబర్ నాటికి సీసీ రోడ్లు పూర్తి కావాలి: ఏలూరు కలెక్టర్
ఏలూరు జిల్లాలో జరుగుతున్న పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్డు పనులు డిసెంబర్ నాటికి పూర్తి కావాలని, 171 పనులకు సంబంధించిన బిల్లులను అప్డేట్ చేయాలని ఎంపీడీవోలకు ఆదేశించారు.