News August 4, 2024
ఏలూరు: నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన ఫణి కుమార్ అనే వ్యక్తికి కొంతమంది ఫోన్ చేసి రూ.10 లక్షలకు రూ.44 లక్షలు ఇస్తానని చెప్పారు. దీంతో ఫణికుమార్ సందేహంతో పోలీసులకి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఒక సెల్ఫోన్ , నకిలీ కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News October 23, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల మార్జిన్లో, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
News October 22, 2025
ప.గో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఎన్టీఆర్(D) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గొర్రె అరవింద్(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా జంగారెడ్డిగూడెం(M) దేవరపల్లికి చెందిన అరవింద్ మైలవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 22, 2025
నరసాపురం: కీచక తండ్రి కటకటాల్లోకి..!

కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను భర్త వద్ద వదిలి గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఆ తండ్రి తాగి వచ్చి తన కుమార్తె (13) పట్ల కీచకుడయ్యాడు. ఇటీవల గల్ఫ్ నుంచి తల్లి రావడంతో కుమార్తెలు విషయం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.