News April 4, 2025
ఏలూరు: నకిలీ పోలీసులు అరెస్టు

సినీ ఫక్కీలో పోలీసులమని చెప్పుకుంటూ భీమడోలు పరిసర ప్రాంతాలలో దుకాణదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు మీడియాకు వివరాలు తెలిపారు. వీరంతా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కేసుని ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్లను అభినందించారు.
Similar News
News April 8, 2025
ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.
News April 8, 2025
కాగుపాడు సర్పంచ్ సస్పెన్షన్

ఉంగుటూరు మండలం కాగుపాడు సర్పంచ్ కడియాల సుదేష్ణను విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉప సర్పంచ్ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News April 8, 2025
పాలకొల్లు: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై పాలకొల్లుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి కాలనీకు చెందిన రత్నకుమార్ తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగేవాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన రత్నకుమార్ ఇంటిపై అంతస్తులో పడుకుంటానని వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.