News November 28, 2024

ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ

image

NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.

Similar News

News November 17, 2025

నిమోనియాపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో నిమోనియా నిర్వహణపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిమోనియా లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సీహెచ్ఓలు ముందస్తు డోసు ఇవ్వాలని అన్నారు.

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.