News November 29, 2024

ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ

image

NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.

Similar News

News December 6, 2024

ప.గో: 111 మంది ఉద్యోగుల తొలగింపు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 111 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ డీఎంహెచ్‌వో శర్మిష్ట గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతలున్నప్పటికీ మెరిట్ లేకుండా పొందిన ఉద్యోగ నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవో 1207ని కొట్టి వేస్తూ ఉద్యోగాలు పొందిన వారు మెరిట్‌ప్రకారం రిక్రూట్ అయిన వారిని కొనసాగించాలని నవంబరు 29న తుదితీర్పులో కోర్టు ఆదేశించింది.

News December 6, 2024

ప.గో: ఇస్త్రీ పెట్టె దొంగలించారు..!

image

పెనుమంట్ర మండలం మార్టేరులో రెడ్డి కళ్యాణమండపం ఎదురుగా ఉన్న పుల్లల షాపులో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు 10 కేజీ, 5 కేజీల తూకం రాళ్లు, ఇస్త్రీ పెట్టి దొంగలించారు. పెనుమంట్ర మండలంలో గత కొంతకాలంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా మార్టేరులో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

News December 5, 2024

ఏలూరు జిల్లాలో 2,443 మంది ఓటు వేశారు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో గురువారం జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,667ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టం చేశారు. ఓట్లు వేసిన వారిలో స్త్రీలు 1,056, పురుషులు 1,387 మంది ఓటు వేశారన్నారు.