News February 14, 2026

ఏలూరు: నిరుద్యోగులకు GOOD NEWS

image

ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 17న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేశ్ తెలిపారు. రాయల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 18-35 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం employment.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News March 9, 2026

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధరలు ఇలా..!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 9, 2026

పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై ఉత్కంఠ

image

మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ సభ ఉంటుందా లేదా అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. అయితే సభకు సమయం తక్కువగా ఉండటంతో సోమవారం నాటికి ఎటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడం గమనార్హం. దీనిపై అటు శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.

News March 9, 2026

షోకాజ్ నోటీసులపై సచివాలయ సర్వేయర్ల ఆగ్రహం

image

సెలవు పెట్టి ఆందోళనలో పాల్గొంటే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో క్యాజువల్ లీవ్ పెట్టి నిరసన తెలిపిన తమకు, సోమవారం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రెండు రోజుల తర్వాత సెలవులను రద్దు చేయడంపై వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు.