News February 14, 2026
ఏలూరు: నిరుద్యోగులకు GOOD NEWS

ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 17న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేశ్ తెలిపారు. రాయల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 18-35 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం employment.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
Similar News
News March 16, 2026
నంద్యాలలో పొట్టి శ్రీరాములు జయంతి

నంద్యాల సంజీవ్ నగర్ సర్కిల్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ ఆశయాలతో పనిచేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కలెక్టర్ కొనియాడారు. కులమత భేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఆమె గుర్తుచేశారు.
News March 16, 2026
ADB: భట్టి పద్దు.. జిల్లా ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..?

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ADB జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ప్రాణహిత-చేవెళ్ల పనులకు భట్టి పద్దులో ప్రాధాన్యం దక్కుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్దవాగు పూర్తికి నిధులు అవసరమున్నాయి. చనాక-కోరాట, పింపల్‌కాడ్, కుఫ్టీ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే సాగునీటి కల సాకారమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.
News March 16, 2026
హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.


