News January 31, 2025
ఏలూరు నుంచి కుంభమేళాకు బస్సు

ఏలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి మహా కుంభమేళాకు బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలిపారు. ఏలూరులో ఆయన గురువారం రాత్రి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4న బస్సు బయలుదేరి 8 రోజుల పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్, వారణాసి, అయోధ్య, గయా, బుద్ధగయ, అరసవల్లి, శ్రీకూర్మం యాత్ర కొనసాగుతుందన్నారు. ఒక్కొక్కరికి రూ.12,500లు ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 14, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 14, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 14, 2025
మస్క్‌తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.
News February 14, 2025
MBNR: హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. గోపి గురించి మెడికల్ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లేబర్ రూమ్‌ను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డలను పరామర్శించారు.