News April 7, 2025
ఏలూరు: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

ఏలూరు జిల్లాలో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో 109 ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?
News November 5, 2025
పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి: VZM SP

పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ దామోదర్ కోరారు. విజయనగరం ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రీసెప్షనిస్టలుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదు రాయడం రానివారికి సిబ్బందే సాయం చేయాలని ఆదేశించారు.
News November 5, 2025
సింగరేణి పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా సింగరేణి సీఎంపీఎఫ్/సీపీఆర్ఎంఎస్ పెన్షనర్ల కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నట్లు జీఎం జి.వి. కిరణ్ కుమార్ తెలిపారు. నేడు ఉదయం 10:30 గంటలకు సింగరేణి హెచ్ఆర్డీ కాన్ఫరెన్స్ హాల్లో క్యాంప్ జరుగుతుందని తెలిపారు. పెన్షనర్లు ఆధార్, పాస్బుక్తో హాజరు కావాలన్నారు.


