News April 7, 2025
ఏలూరు: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

ఏలూరు జిల్లాలో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో 109 ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 20, 2025
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందజేస్తామన్నారు.
News April 20, 2025
మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనాజిపురం-దాచారం గ్రామాల మధ్య ఉన్న పత్తి మిల్లు వద్ద బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంపటికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.