News December 31, 2024
ఏలూరు: నేర నియంత్రణకు పటిష్ఠ చర్యలు
పోలీస్ యంత్రాంగం సమిష్టి కృషితో 2024వ సంవత్సరంలో నేరాలను అదుపు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప కిషోర్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నేర నియంత్రణ కోసం గంజాయి, నాటుసారా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News January 26, 2025
కాళ్ళలో సీనియర్ ఓటర్లను సన్మానించిన తహశీల్దార్
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం కాళ్ల హైస్కూల్లో నిర్వహించారు. తహశీల్దార్ జి. సుందర్ సింగ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ఆవశ్యకతను, ఓటు హక్కు విలువలను వివరించారు. సీనియర్ ఓటర్లైన వయోవృద్ధులను సత్కరించి, కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి కొత్త ఓటు గుర్తింపు కార్డును పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. వీఆర్వోలు శివనాగరాజు, రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
News January 25, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే రాధాకృష్ణ
సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామంలో పర్యటించారు. తణుకు మండలంలోని తేతలి తవ్వ గ్రామాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు.
News January 25, 2025
నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష
ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.