News April 1, 2025

ఏలూరు: పండుగ రోజుల్లో భారీగా చికెన్ అమ్మకాలు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినేవాళ్లు తగ్గడంతో ధర అమాంతంగా రూ.200 దిగువకు పడిపోయింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావం లేకపోవడంతో కొనుగోళ్లు పెరగడం, సరఫరా తగ్గడంతో పలు చోట్ల కేజీ రూ.300కు పెరిగింది. ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. మరి మీ ప్రాంతంలో ధర ఎంతో కామెంట్ చేయండి.

Similar News

News November 1, 2025

RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

image

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 1, 2025

హాట్ టాపిక్‌గా సీఎంకు స్వాగతం పలికిన MLA దొంతి సీన్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు దెబ్బతినడంతో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌కి వచ్చారు. సీఎంకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటిసారిగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వరంగల్‌కు సీఎం ఎప్పుడొచ్చినా ఆ కార్యక్రమాల్లో దొంతి కనిపించలేదు. కానీ, మొదటిసారి రావడంపై హాట్ టాపిక్‌గా మారింది.

News November 1, 2025

భద్రకాళి అమ్మారిని దర్శించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

image

వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.